ఇప్పుడెక్కడ చూసినా పఠాన్ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించే మాట్లాడుకుంటున్నారు. విడుదలైన పన్నెండు రోజుల్లో 400 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి, ఈ ఫీట్ అందుకున్న అంత్యంత వేగవంతమైన చిత్రంగా పఠాన్ సెన్సేషన్ సృష్టించింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి 2 కే ఈ మార్క్ ను అందుకోవడానికి 15 రోజులు సమయం పట్టింది.
ఇండియాలోనే కాక ఓవర్సీస్ లో కూడా పఠాన్ కలెక్షన్లు సునామీని సృష్టిస్తున్నాయి. USA బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 14.5 M డాలర్లను రాబట్టిన పఠాన్, దీంతో USA లో సెకండ్ హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా చరిత్రకెక్కడమే కాక, ఆల్రెడీ ఈ ప్లేస్ లో ఉన్న గ్లోబల్ సెన్సేషన్ RRRని వెనక్కి నెట్టేసి, ప్రభంజనం సృష్టించింది.
ఇక, ఇప్పుడు పఠాన్ చూపంతా బాహుబలి 2 (20.5M) కలెక్షన్ల మీదనే ఉంది. మరి, బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్న పఠాన్ బాహుబలి 2 ని బీట్ చేస్తుందా..? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa