టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా "వారిసు". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటించింది. థమన్ సంగీతం అందించారు. ఈ ఏడాది పొంగల్ కానుకగా తమిళ, తెలుగు భాషలలో విడుదలైన ఈ సినిమా లేటెస్ట్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 300కోట్ల మార్క్ ను చేరుకొని, విజయ్ కెరీర్ లో సెకండ్ 300కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది.
తాజాగా ఈ సినిమా వా తలైవా ఫుల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటను శంకర్ మహదేవన్, కార్తీక్, తమన్, దీపక్ బ్లూ, అరవింద్ శ్రీనివాసన్ ఆలపించగా, వివేక్ లిరిక్స్ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa