ట్రెండింగ్
Epaper    English    தமிழ்

RC15 : 500 మంది డాన్సర్స్ తో భారీ పాట

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 05:31 PM

సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'RC15' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, భారతీయుడు 2 యొక్క కీలక షెడ్యూల్‌ను ముగించిన తర్వాత దర్శకుడు ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ రానున్న షెడ్యూల్ లో భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌ విజువల్స్‌తో ఒక పాటను రూపొందించనున్నట్లు తాజా సమాచారం. ఈ పాట కోసం దాదాపు 500 మంది డ్యాన్సర్లను నియమించినట్లు సమాచారం.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్‌ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa