వరస సినిమాలను విడుదల చేస్తూ, తరచుగా ప్రేక్షకులను పలకరిస్తూ, వారిని మెప్పు పొందాలని నిరంతరం పాటుపడే యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "CSI సనాతన్".
ఆది కెరీర్ లో 20వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు శివశంకర్ దేవ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనీష్ సోలొమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలీ రెజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, వాసంతి, భూపాల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు. ఈ మేరకు CSI సనాతన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మార్చి 10వ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa