ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ 'ధృవ నచ్చతిరమ్' కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 07:00 PM

గౌతమ్ మీనన్‌ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ అధికారకంగా ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'ధృవ నచ్చతిరమ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, చిత్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమా షూటింగ్ ను నుంగంబాక్కంలో ప్రారంభించినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో పార్థిబన్‌పై జివిఎం కొన్ని సన్నివేశాలను చిత్రీకరించింది. వీలైనంత త్వరగా ప్యాచ్ వర్క్ పూర్తి చేసి సినిమాను థియేటర్లలోకి విడుదల చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

స్పై థ్రిల్లర్  ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్లస్ లో విక్రమ్ టీమ్ హెడ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్, పార్తీబన్, సిమ్రాన్, రాధిక, దివ్య దర్శిని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa