పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ పుష్ప మూవీ సీక్వెల్ కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఎదురుచూపులకు, వారు ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలకు తగిన రీతిలో సమాధానం చెప్పేలా పుష్ప సీక్వెల్ ను రూపొందిస్తున్నారు మేకర్స్.
రీసెంట్గానే వైజాగ్ లో పుష్ప 2 తొలి షెడ్యూల్ మొదలవ్వగా, తాజాగా అది పూర్తయ్యింది. ఈ మేరకు అల్లు అర్జున్ వైజాగ్ కి సెండ్ ఆఫ్ చెప్తూ బీచ్ లో దిగిన పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ షేర్ చేసారు. ఈ సందర్భంగా వైజాగ్ కి థాంక్స్ చెప్పారు. అలానే కొంతమంది అభిమానులతో ఫోటోలు కూడా దిగారు. పోతే, ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ అండ్ డాన్సర్స్ పై బీచ్ సెట్టింగ్ లో సుకుమార్ ఒక పవర్ఫుల్ ఇంట్రో సాంగ్ ను చిత్రీకరించారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa