కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సార్ మూవీతో టాలీవుడ్ కి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17న విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ సార్/ వాతి ట్రైలర్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసారు. హైదరాబాద్ లోని AMB సినిమాస్ స్క్రీన్ -1లో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి సార్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ లో 05:04 నిమిషాలకు ట్రైలర్ లాంచ్ కాబోతుందని కాసేపటి క్రితమే సార్/వాతి ట్రైలర్ రిలీజ్ టైం ను ఎనౌన్స్ చేస్తూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సంయుక్త బ్యానర్ లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa