ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బిచ్చగాడు 2" నుండి షాకింగ్ ఎనౌన్స్మెంట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 06:09 PM

కోలీవుడ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ప్రస్తుతం తనకు స్టార్ స్టేటస్ అందించిన బిచ్చగాడు 2 లో నటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఈ సినిమా నుండి షాకింగ్ ఎనౌన్స్మెంట్ జరిగింది.


బిచ్చగాడు 2 సినిమా యొక్క తొలి నాలుగు నిమిషాల స్నీక్ పీక్ ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. సినిమా విడుదలకు ముందు మేకర్స్ నుండి వచ్చిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ నిజంగా హర్షణీయం.  


విజయ్ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఆయనే బాణీలు కూడా సమకూరుస్తున్నారు. ఈ మధ్యనే ఒక పెద్ద ప్రమాదం నుండి క్షేమంగా బయటపడిన విజయ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చాలా నమ్మకంగా ఉన్నారు. పోతే, ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa