కొత్త దర్శకుడు మురళీ నాగ శ్రీనివాస్ గంధం డైరెక్షన్లో సాయి రోనక్, అవికా గోర్ జంటగా నటిస్తున్న సినిమా "పాప్ కార్న్". మెలోడ్రామా జానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త బ్యానర్ లపై ఎం. భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీన అంటే రేపు, 2గంటల 13 నిమిషాల క్రిస్పీ రన్ టైంతో థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉంది.