రాజకీయాలతో, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాసింత వీలు కుదుర్చుకుని, నటసింహం నందమూరి బాలకృష్ణ గారి "అన్స్టాపబుల్ విత్ NBKS 2" టాక్ షోకి విచ్చేసి, సినీ,రాజకీయ, వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలపై మనసు విప్పి మాట్లాడి, ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యారు.
అన్స్టాపబుల్ ఫైనల్ ఎపిసోడ్ గా చిత్రీకరింపబడిన ఈ పవర్ ఫినాలే ఎపిసోడ్ యొక్క తొలి భాగం ఇప్పటికే ఆడియన్స్ ను అలరించగా, తాజాగా రెండవ భాగం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. పార్ట్ 2 ఎక్కువశాతం పవన్ రాజకీయ జీవితానికి సంబంధించినగా ఉండబోతుందని తెలుస్తుంది.