షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో యువ నటుడు సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. విమేన్ వెనసడై పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని సెలెక్టివ్ థియేటర్లలో నిన్న మహిళల కోసం ఉచితంగా ఈ సినిమాను మూవీ టీమ్ ప్రదర్శించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, నిన్న మొత్తం 33,136 మంది మహిళలు ఈ చిత్రాన్ని వీక్షించారు అని సమాచారం. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు తమ ప్రేమను మరియు సమయాన్ని వెచ్చించినందుకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చై బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.