ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న అమిగోస్ మూవీ ప్రదర్శన సమయంలో CSI సనాతన్ ట్రైలర్ ని స్క్రీన్ చెయ్యబోతున్నట్టు కాసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. రేపు ఉదయం 10:10 గంటలకు యూట్యూబులో CSI సనాతన్ ట్రైలర్ విడుదల కానుంది.
కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న అమిగోస్ పై ఆడియన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో సరికొత్త కధాంశంతో రూపొందిన అమిగోస్ మూవీతో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది.