సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'పఠాన్' సినిమా హిందీ, తెలుగు మరియు తమిళంలో విడుదలైయింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, కింగ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలైన 15 రోజులలో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా యొక్క హిందీ వెర్షన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి సెన్సషనల్ రికార్డు ని నెలకొల్పింది.
ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుంది. హ్యాండ్సమ్ హంక్ జాన్ అబ్రహం ఈ బిగ్గీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.