మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కలయికలో మూడవ సినిమా (SSMB 28) రూపొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గానే SSMB 28 షూటింగ్ హైదరాబాద్ అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో జరిగింది. ఈ షెడ్యూల్ లో మహేష్ పలు కీలక యాక్షన్ సన్నివేశాలలో నటించారు. ఈ రోజు మహేష్, నమ్రతల 18వ వెడ్డింగ్ యానివర్సరీ కావడంతో నిన్ననే స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో SSMB 28 నెక్స్ట్ న్యూ షెడ్యూల్ ఈ నెల 20 నుండి మొదలు కాబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.