మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదరుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఆచార్య ప్లాప్ అవ్వడంతో.. చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో Rc15 మూవీ తెరకెక్కుతుండగా.. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతందా...? ఎప్పుడు చూసేద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఈసినిమా షూటింగ్ కు సబందించి ఓ అప్ డేట్ ఇచ్చారు డైరెక్టర్ శంకర్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ను అందించారు డైరెక్టర్ శంకర్. ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం చార్మినార్ వద్ద చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఆయన తెలిపాడు. దీనికి సంబంధించి శంకర్ చార్మినార్ దగ్గరగా ఉన్న ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ కాని.. రామ్ చరణ్ సాంగ్ కాని ఇక్కడ షూట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తరువాత మూవీ టీమ్ రాజమండ్రి వెళ్తారని తెలుస్తోంది.