దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న తొలిచిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు లిరికల్ సాంగ్స్ విడుదల కాగా, వాటికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 12 సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలో వీబీవీకే గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగబోతుందని స్పెషల్ పోస్టర్ తో తెలియచేయడం జరిగింది.
మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17న థియేటర్లలో సందడి చెయ్యడానికి సిద్ధమవుతుంది.