యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కన్నడ నటి కాశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న చిత్రం " వినరో భాగ్యము విష్ణుకథ". మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో, అల్లు అరవింద్ గారి సమర్పణలో లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కావలసి ఉండగా, తాజాగా ఒకరోజు విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఈ మేరకు సరిగ్గా మహాశివరాత్రి రోజు అంటే ఫిబ్రవరి 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వినరో భాగ్యము విష్ణుకథ మూవీ గ్రాండ్ గా విడుదల కావడానికి రెడీ అయ్యింది.
మురళీశర్మ కీరోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa