కన్నడ చిత్రపరిశ్రమ నుండి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న సినిమా "కబ్జా". కొన్ని రోజుల క్రితం కబ్జా ఫస్ట్ సింగిల్ ను యంగ్ సెన్సేషన్ విశ్వక్ సేన్ విడుదల చేసారు. ఆ పాటకు శ్రోతల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. ఇప్పుడు 'నమామి' టైటిల్ తో రెండవ లిరికల్ సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేసారు. ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం 02:34 నిమిషాలకు చెన్నైలో జరగబోయే గ్రాండ్ ఈవెంట్ లో కబ్జా సెకండ్ సింగిల్ పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్నట్టు స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది.
R. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రేయా శరణ్ కీరోల్ లో నటిస్తున్నారు. రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 17వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa