గతంలో 'రాగల 24 గంటల్లో', 'అలాంటి సిత్రాలు' సినిమాలలో కీలక పాత్రలు పోషించిన అజయ్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం "అజయ్ గాడు".ఈ సినిమాలో భానుశ్రీ, శ్వేతా మెహతా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోగా నటించడమే కాక దర్శకుడిగా, సహనిర్మాతగా కూడా అజయ్ వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి 'చెప్పే తరమిది' మెలోడియస్ సాంగ్ విడుదలయ్యింది. ఈ పాటను కార్తీక్ కొడకండ్ల స్వరపరచగా, సాయి కృష్ణ, నూతనమోహన్ ఆలపించారు. వీరు సాహిత్యం అందించారు.