మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నూతన చిత్రం మొదలుపెట్టబోతున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. రిపబ్లిక్ డే, రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 26వ తేదిన ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్ లోగోని లాంఛ్ చేయనున్నారు. రవితేజకు జోడిగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa