ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని ఖరారు చేసిన 'ప్రాజెక్ట్ K'

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 18, 2023, 04:51 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్‌ డైరెక్షన్ లో "ప్రాజెక్ట్ K" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ రెబెల్ స్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక్స్ పదుకొనె నటిస్తుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా బిగ్గీ సంక్రాంతి పండుగ ట్రీట్‌గా ప్రపంచవ్యాప్తంగా 12 జనవరి, 2024న విడుదల కానుంది అని మూవీ మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటించేందుకు మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ హై బడ్జెట్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రభాస్ సూపర్ హీరోగా కనిపించనున్న ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa