కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ "సార్" మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలై, సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. తమిళంలో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో రన్ అవుతుంది.
ఇక, తెలుగులో కలెక్షన్ల విషయానికొచ్చేసరికి, ఇరు తెలుగు రాష్ట్రాలలో శుక్ర, శనివారాల్లో ఈ సినిమా 10.50 కోట్లను కలెక్ట్ చేసి, క్లీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విశేషమేంటంటే, గతంలో ధనుష్ సూపర్ హిట్ రఘువరన్ బీటెక్ అదే పేరుతో తెలుగులో అనువాదమై సూపర్ హిట్ గా నిలవగా, ఆ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లను సార్ మూవీ తొలిరోజే కలెక్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa