ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Mr.కింగ్ ట్రైలర్ : ఉన్నతమైన లక్ష్యం, స్వచ్ఛమైన ప్రేమ

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2023, 06:55 PM

యువనటుడు శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "Mr. కింగ్". ఈ సినిమాను శశిధర్ చావలి డైరెక్ట్ చేస్తున్నారు. యశ్విక నిష్కళ హీరోయిన్ గా నటిస్తుంది. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. తాజాగా ట్రైలర్ విడుదలయ్యింది. ఉన్నతలక్ష్యం, స్వచ్ఛమైన ప్రేమల మధ్య నలిగినా ఒక యువకుడి పోరాటమే ఈ సినిమా. ఈ పోరాటంలో తుదకు హీరో అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? ప్రేమను గెలిపించుకున్నాడా..? అనేది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. 


మురళి శర్మ, తనికెళ్ళ భరణి, ఉర్వి సింగ్, వెన్నెల కిషోర్, సునీల్, SS కంచి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. BN రావు నిర్మిస్తున్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa