మాస్ రాజా రవితేజ హీరోగా, రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోయిన్లుగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించిన ఫన్ యాక్షన్ ఎంటర్టైనర్ "మిరపకాయ్". 12 జనవరి, 2011లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది. విడుదలై, పుష్కరకాలం గడుస్తుండడంతో ఈ ఏడాది జనవరి 26కి మిరపకాయ్ సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చెయ్యాలని తలంచగా, కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఐతే, ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ న్యూ రీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మిరపకాయ్ మూవీ గ్రాండ్ రీ రిలీజ్ కాబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa