ట్రెండింగ్
Epaper    English    தமிழ்

VBVK : రెండో రోజు కూడా సాలిడ్ వసూళ్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2023, 09:30 AM

శుక్రవారం విడుదలైన వినరో భాగ్యము విష్ణుకథ సినిమాకు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. విడుదలకు ముందు ప్రొమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదల తదుపరి బ్లాక్ బస్టర్ రివ్యూలను అందుకుంటుంది. తొలి రోజు తొలి షో నుండి హౌస్ ఫుల్ రన్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండోరోజు కూడా అలానే రన్ అయ్యింది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా 2.75 గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా అదే రేంజులో 2.4 కోట్లను వసూలు చేసింది. ఇక, వీక్ డేస్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తిగా మారింది.


మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించిన ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa