కొంచెంసేపటి క్రితమే నటుడు తారకరత్న గారి అంత్యక్రియలు ముగిసాయి. తన ఏకైక కుమారుడికి తండ్రి మోహన కృష్ణ బరువెక్కిన హృదయంతో అంతిమ సంస్కారాలను పూర్తి చేసారు. తారకరత్న పాడెను నందమూరి అన్నదమ్ములు మోశారు. తారకరత్నతో కలిసి వైకుంఠ రధంలోనే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కూడా మహాప్రస్థానానికి రావడం జరిగింది. తారకరత్న అంతిమయాత్రలో వేలాదిమంది ప్రేక్షకాభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.