'మసూద' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తిరువీర్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "పరేషాన్". పావని కరణం హీరోయిన్ గా నటిస్తుంది. రూపక్ రొనాల్డ్సన్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్ళపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చెయ్యడానికి మేకర్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రేపు రాక్ సాలిడ్ పరేషాన్ టీజర్ విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేసి ప్రకటించారు.