బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ని నిర్వహించారు. ఒక అభిమాని డార్లింగ్ ప్రభాస్ గురించి అడగ్గా, కంగనా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, డార్లింగ్ ప్రభాస్ కలయికలో వచ్చిన 'ఏక్ నిరంజన్' సినిమాలో కంగనా హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ.. ప్రభాస్ ఇంట్లో అత్యుత్తమమైన ఆహారం ఉంది. ప్రభాస్ ఒక అత్యద్భుతమైన హోస్ట్... అని ఇప్పుడు నిర్వహించిన సోషల్ మీడియా చిట్ చాట్ సెషన్లో కంగనా వ్యాఖ్యానించింది.