గీత్ ఆనంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం "గేమ్ ఆన్". దయానంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్స్, గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్త బ్యానర్లపై రవి కస్తూరి నిర్మిస్తున్నారు. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ సంగీతం అందించారు.
రియల్ టైం సైకలాజికల్ నేపథ్యంలో హై వోల్టేజ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. గ్లిమ్స్ వీడియోతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల కాబోతుంది. రేపు మధ్యాహ్నం 03:33 నిమిషాలకు గేమ్ ఆన్ టీజర్ విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ విడుదల చేసారు.