తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ద్విభాషా చిత్రం "సార్ /వాతి". శుక్రవారం విడుదలైన ఈ సినిమా రెండు భాషల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ, బాక్సాఫీస్ వద్ద భీకర కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఫస్ట్ వీకెండ్ కల్లా రెండు భాషల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 51కోట్లను రాబట్టిన ఈ సినిమా ధనుష్ కెరీర్ లో బెస్ట్ ఫస్ట్ వీక్ ఓపెనర్ గా నిలిచింది. పోతే, ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఇందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సుమంత్ ట్వీట్ చేసారు. అలానే సార్ విజయానికి ఆనందం వ్యక్తం చేసారు.