సినీ హీరో నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి. మహాప్రస్థానం శ్మశానవాటికలో తారకరత్న భౌతికకాయానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు నివాళులర్పించారు.