షాజీ కైలాస్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'కడువ' సినిమా జూలై 2022లో థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సంయుక్త కథానాయికగా నటించింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా యొక్క తమిళ వెర్షన్ మార్చి 3, 2023న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. తిరుపతి పిక్చర్స్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటించారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ మరియు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.