జి. మనోహరన్ సమర్పణలో, లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించిన చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాకు షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్ధి, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 3వ తేదీన ధియేటర్లకొచ్చిన 'ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ను రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.