యువనటుడు శరణ్ కుమార్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "Mr. కింగ్". ఈ సినిమాను శశిధర్ చావలి డైరెక్ట్ చేస్తున్నారు. యశ్విక నిష్కళ హీరోయిన్ గా నటిస్తుంది. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో రీసెంట్గానే మేకర్స్ ట్రైలర్ ను విడుదల చేసారు. దానికి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. తాజాగా యువనటుడు శరణ్ కుమార్ కి, Mr. కింగ్ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలియచేస్తూ బాద్షా కిచ్చా సుదీప్ స్పెషల్ వీడియోను విడుదల చేసారు.
మురళి శర్మ, తనికెళ్ళ భరణి, ఉర్వి సింగ్, వెన్నెల కిషోర్, సునీల్, SS కంచి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. BN రావు నిర్మిస్తున్నారు.