చిన్న సినిమాగా, అతి తక్కువ థియేటర్లలో విడుదలైన 'ది కాశ్మీర్ ఫైల్స్' మూవీ ఆపై రోజురోజుకూ థియేటర్లను పెంచుకుంటూ, బాక్సాఫీస్ వద్ద ప్రభంజన కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తొంభైల కాలంలో కాశ్మీరీ పండితులు ఎదురుకొన్న హృదయవిదారకర పరిస్థితులను, వారి ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం ప్రతి ఒక్క భారతీయుడిని కదిలించింది.
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ది కాశ్మీర్ ఫైల్స్ అవార్డుల జాబితాలోకి తాజాగా అత్యున్నతమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చి చేరింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2023 అవార్డులలో ఉత్తమ చిత్రంగా ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ నిలిచింది.