భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు 'దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు'. ఈ ఏడాది ఈ అవార్డులను ప్రకటించారు. ఈరోజు ముంబైలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కాగా, ఈ అవార్డులో రణబీర్ ఉత్తమ నటుడిగా,అలియా ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. 'బ్రహ్మాస్త్ర' చిత్రానికి గానూ రణ్‌బీర్ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ కార్యక్రమంలో పలువురు స్టార్స్ అలియా భట్, వరుణ్ ధావన్, అనుపమ్ ఖేర్, రేఖ దుల్కర్ సల్మాన్, రిషబ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.