మెగాపవర్ స్టార్ రాంచరణ్ మూవీ మావెరిక్ శంకర్ దర్శకత్వంలో RC 15 సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే కీలక షెడ్యూల్ ముగించుకున్న ఈ సినిమా యొక్క నెక్స్ట్ షెడ్యూల్ ఇప్పుడప్పుడే మొదలయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే, శంకర్ ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉండగా, రాంచరణ్ RRR ఆస్కార్ ప్రమోషన్స్ కోసం నిన్న రాత్రి USA కి బయలుదేరి వెళ్లారు.
వచ్చే నెల 12వ తేదీన ఆస్కార్ 2023 కార్యక్రమం జరగనుంది. మరి, అప్పటివరకు రామ్ చరణ్ అక్కడే ఉండి RRR ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారన్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ మేరకు నిన్న రాత్రి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో రాంచరణ్ హల్చల్ చేసిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరి, RRR ఆస్కార్ పురస్కారం దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.