కొత్త దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం "వినరో భాగ్యము విష్ణుకథ". గత శుక్రవారం థియేటర్లకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. రెండ్రోజుల్లో 5.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద ధుమ్ము రేపుతున్న ఈ సినిమా యొక్క టికెట్లపై మేకర్స్ నుండి ఒక వినూత్న ప్రకటన వచ్చింది. బుధ, గురువారాల్లో ఒకటి కొంటే మరొకటి ఉచితం .. అని ప్రకటించిన ఆఫర్ తాజాగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడినట్టు సమాచారం. మరి, అతి త్వరలోనే ఈ ఆఫర్ పై మేకర్స్ అధికారిక ప్రకటన చెయ్యనున్నారు.