మాస్ రాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న "రావణాసుర" నుండి రీసెంట్గానే ప్రేమికుల దినోత్సవం కానుకగా ఎనర్జిటిక్ బ్రేకప్ సాంగ్ విడుదలయ్యింది. ప్యార్ లోన పాగలే.. అని సాగే ఈ పాటను మాస్ రాజా స్వయంగా ఆలపించి, శ్రోతలకు మరింత కిక్ అందిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. శేఖర్ మాస్టర్ మెస్మరైజింగ్ కొరియోగ్రఫీ అందించారు. ఇన్స్టంట్ ఛార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 3 మిలియన్ కు పైగా ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa