ఇటీవలే మసూద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు నటుడు తిరువీర్. ఈ యంగ్ హీరో ప్రస్తుతం పరేషాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ ను నేడు చిత్రబృందం రిలీజ్ చేసింది. తెలంగాణలోని ఓ గ్రామంలో స్నేహితుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో టీజర్ కొంచెం ఫన్‌గా, సీరియస్‌గా సాగుతుంది. ఈ చిత్రంలో తిరువీర్ కు జోడీగా పావని కర్ణన్ నటిస్తోంది.