బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమా "నేను స్టూడెంట్ సర్" నుండి కాసేపటి క్రితమే సెకండ్ సింగిల్ ప్రోమో విడుదలయ్యింది. 24/7 ఒకటే ధ్యాసా .. గుండెలోపలే ఉందొక ఆశ.. దానికోసమే పడుతున్న ఈ ప్రయాస ..అని సాగే ఈ పాట యొక్క పూర్తి లిరికల్ వీడియో ఫిబ్రవరి 23న విడుదల కానుంది.
రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో యూత్ ఫుల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో గణేష్ కి జోడిగా అవంతికా దస్సనీ నటిస్తుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. నంది సతీష్ వర్మ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa