మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీ హిట్ "మగధీర" రీ రిలీజ్ కాబోతుందని కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. ఐతే, రీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చెయ్యలేదు.
రాంచరణ్ వచ్చే నెల 27న 38వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా 2009లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అయినటువంటి ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అవడంతో, మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.