నిన్న సాయంత్రం విడుదలైన 'ఏజెంట్' మూవీ ఫస్ట్ సింగిల్ 'మళ్ళీ మళ్ళీ' లవ్ ట్రాక్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్లో ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హప్ తమిళ స్వరపరచి, ఆలపించిన ఈ ఎలక్ట్రిఫయింగ్ సాంగ్ యూత్ కి ఈజీగా కనెక్ట్ అవ్వడంతో, ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా అఖిల్, సాక్షి వైద్యల ఆన్ స్క్రీన్ పెయిర్ చాలా రెఫ్రెషింగ్ గా ఉంది.
క్రియేటివ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మమ్ముట్టి కీరోల్ లో నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ టు సినిమాస్ సంయుక్త బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.