‘వాల్తేరు వీరయ్య’గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో "భోళా శంకర్" సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీవీ వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని వినిపిస్తోంది. ఇదే నిజం అయితే త్వరలోనే చిరంజీవి-వినాయక్‌ల కాంబినేషన్లో మరో సినిమా ఉండబోతుంది.