గ్లోబల్ సెన్సేషన్ రౌద్రం రుధిరం రణం (RRR) మరోసారి థియేటర్లకు రాబోతుంది. ఐతే, ఇక్కడ కాదు.. నార్త్ అమెరికాలో. వచ్చే నెల్లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఉన్న నేపథ్యంలో, ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి RRR అక్కడ బిగ్ స్క్రీన్స్ లో సందడి చెయ్యడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు మార్చి 3వ తేదీన అదికూడా తెలుగు వెర్షన్ లో RRR మూవీ రీ రిలీజ్ కాబోతుంది.
రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమాలో అజయ్ దేవగణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ కీలకపాత్రల్లో నటించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.