ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సొంతం చేసుకున్న RRR మరోవైపు ఆస్కార్ 2023 కోసం పోటీ పడుతుంది. కాగా లాస్ ఏంజిల్స్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ లో రెండు కేటగిరిల్లో RRR నామినేట్ అయ్యింది. ఉత్తమ యాక్షన్ సినిమా విభాగంలో RRR నామినేట్ కాగా.. బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ నామినేట్ అయ్యారు. ఈ అవార్డ్స్ విజేతలను మార్చి 16న ప్రకటించనున్నారు.