జీవీ ప్రకాష్ కుమార్ స్వరకల్పనలో రూపొందిన సార్/వాతి చిత్రంలోని మాస్టారూ మాస్టారూ / వా వాతి పాటకు శ్రోతల నుండి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ బ్యూటిఫుల్ లవ్ మెలోడీని ఇరు భాషల్లో సింగర్ శ్వేతా మోహన్ ఆలపించారు. ఐతే, ఇప్పుడు తాజాగా ఈ పాట యొక్క రిప్రైజింగ్ వెర్షన్ ని మేకర్స్ విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు సాయంత్రం 04:05 నిమిషాలకు మాస్టారూ మాస్టారూ రిప్రైజింగ్ వెర్షన్ విడుదల కావడానికి సిద్దమయ్యింది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ఈ సినిమా డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ హిట్ గా నిలిచింది.