యంగ్ హీరో నాగశౌర్య నుండి రాబోతున్న కొత్తచిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ఫీల్ గుడ్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్గా విడుదలైన టీజర్ కి ఆడియన్స్ నుండి హార్ట్ టచింగ్ రెస్పాన్స్ రాగా, తాజాగా ఫస్ట్ సింగిల్ 'కనుల చాటు మేఘమా' లిరికల్ వీడియో విడుదలయ్యింది. ఈ ఫీల్ గుడ్ బ్రేకప్ సాంగ్ ని అభాస్ జోషి, ఆలప్ లిప్సిక ఆలపించారు. కళ్యాణి మాలిక్ స్వరపరచగా, లక్ష్మి భూపాల సాహిత్యం అందించారు.