టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ సింహా, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం "భాగ్ సాలే". వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్త బ్యానర్లపై అర్జున్ దాస్యం,యష్ రంగినేని, సింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ప్రణీత్ సాయి దర్శకత్వంలో థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ రోజు ఈ సినిమా నుండి స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ రోజు హీరో శ్రీ సింహ పుట్టినరోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. అదృష్టం కోసం గాభరాపడుతూ పరిగెత్తుతున్న శ్రీ సింహాను ఈ పోస్టర్ లో మనం చూడవచ్చు.
![]() |
![]() |