రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం "చంద్రముఖి 2". పి వాసు దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ "చంద్రముఖి" కి దాదాపు పదిహేడేళ్ల తదుపరి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా మూడవ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ప్రేక్షకులకు తెలియచేస్తూ సెట్స్ నుండి కొన్ని పిక్స్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్.
పోతే, ఈ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు. రాధికా శరత్ కుమార్, వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మి మీనన్, సృష్టి డాంగే కీలకపాత్రల్లో నటిస్తున్నారు.